సినిమా వార్తలు

నాగ్ సెంటిమెంట్ హీరోయిన్ కు మ‌రో ఛాన్స్‌


8 months ago నాగ్ సెంటిమెంట్ హీరోయిన్ కు మ‌రో ఛాన్స్‌

హీరోయిన్ అనుష్కకు అవకాశాలు ఇవ్వడంలో హీరో నాగార్జున ముందుంటార‌నే టాక్ వినిపిస్తుంటుంది. బొద్దుగా ఉన్నప్పుడే పిలిచి అవకాశాలు ఇచ్చిన నాగ్, ఇప్పుడు స్లిమ్ అయిన ఆ ముద్ద‌గుమ్మ‌కు వెంటనే మరో సినిమా అవ‌కాశం ఇచ్చారు. నాగ్, స్వీటీ కాంబినేషన్  మరోసారి ఫిక్స్‌ అయ్యింది. త్వరలోనే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో  సెట్స్ పైకి వెళ్ళబోతున్నారు నాగార్జున. మన్మధుడు 2 పేరుతో రాబోతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా అనుష్కను ఎంపిక చేశారని తెలుస్తోంది. నాగ్ అడిగితె అనుష్క నో చెప్పే అవ‌కాశ‌మే లేదు. అనుష్కను పరిశ్రమకి పరిచయం చేసిన వ్యక్తి నాగ్. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింద‌ని చెప్పుకుంటారు.నాగ్ సినిమాల్లో  అనుష్క గెస్ట్ రోల్స్ కూడా చేసింది. మ‌రోవైపు అనుష్కను సెంటిమెంట్ గా నాగ్ ఫీల్ అవుతుంటార‌ట‌. అలాగే తనకు బ్రేక్ ఇచ్చిన నాగ్ పై అనుష్క ఎన‌లేని అభిమానాన్ని కురిపిస్తుంటుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌.