సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ లో మరో అందాల తార!


11 months ago ఎన్టీఆర్ బయోపిక్ లో మరో అందాల తార!

ఎన్టీఆర్ బయోపిక్ రోజురోజుకి క్రేజ్ ను పెంచుకుంటూపోతోంది. ఇప్పటివరకు పరిచయం చేసిన పాత్రలన్నీ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయ్. రానా, చంద్రబాబు గా ఒదిగిపోగా, సుమంత్ ANR గా, కళ్యాణ్ రామ్ హరి కృష్ణగా, రకుల్ శ్రీదేవిగా, తమన్నా జయప్రద గా ఇప్పటికే ఎంపిక కాగా, తాజా గా నిన్న నిత్యా మీనన్ ను సావిత్రిగా చూపించి క్రిష్ ప్రేక్షకులను మెప్పించారు. 

ఈ రోజు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అందాల నటి అనుష్క , అలనాటి అందాల భామ బి. సరోజ దేవి పాత్ర పోషించనుంది అని తెలుస్తోంది. క్రిష్ కి మంచి స్నేహితురాలు అయిన అనుష్క ఈ ఆఫర్ కు వెంటనే ఒప్పుకుందట. ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్న ఈ చిత్రం లో బాలయ్య ఎన్టీఆర్ గా పూర్తిగా ఒదిగిపోయారు. ఇక నటనలో కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడో లేదో వేచి చూడాలి. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా విడుదల కానున్న విషయం విదితమే. మొదటి భాగం కథానాయకుడు జనవరి 9 న విడుదల కానుండగా రెండో భాగం మహానాయకుడు జనవరి 24 న విడుదల కానుంది.