సినిమా వార్తలు

మ‌రో ఘ‌న‌త సాధించ‌నున్న క్రిష్‌


1 year ago మ‌రో ఘ‌న‌త సాధించ‌నున్న క్రిష్‌

ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం అత్యంత అరుదుగా చూసుంటాం. కానీ ఒకే దర్శకుడు తీసిన మూడు సినిమాలు కేవలం 16 రోజుల వ్యవధిలో రిలీజవ్వడం ఎప్పుడూ చూసివుండం. వచ్చే ఏడాది జనవరిలో ఘ‌న‌త‌ చోటు చేసుకోబోతోంది. ఆ దర్శకుడు మ‌రెవ‌రో కాదు. తెలుగులో విలక్షణ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన క్రిష్ ఈ రికార్డు ద‌క్కించుకోనున్నారు. జనవరి 9న క్రిష్ ‘యన్.టి.ఆర్’ కథానాయకుడు’తో పలకరించనున్న సంగతి తెలిసిందే. దీని రెండో భాగం ‘యన్.టి.ఆర్ మహా నాయకుడు’ జనవరి 24న రిలీజవుతుందని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక సినిమా రెండు భాగాలు రెండు వారాల్లో రిలీజవడమే ఒక రికార్డు. ఐతే ‘యన్.టి.ఆర్-2’ వచ్చిన మరుసటి రోజే.. అంటే జనవరి 25న  క్రిష్ తీసిన బాలీవుడ్ మూవీ ‘మణికర్ణిక’ విడుద‌ల కానుంది. క్రిష్ ప్రమేయం లేకుండా కంగన దర్శకత్వంలో రీషూట్లు జరిగినప్పటికీ దాని దర్శకుడిగా క్రిష్‌కే క్రెడిట్ ఇస్తున్నారు. ఐతే ‘మణికర్ణిక’ యధావిధిగా రిలీజవుతుందా అనే విషయంలో కొన్ని సందేహాలున్నాయి. అనుకున్న ప్రకారం ఆ సినిమాకూడా విడుద‌లైతే కేవ‌లం 16 రోజుల్లో మూడు సినిమాలతో అది కూడా రెండు వేర్వేరు భాషల్లో త‌న‌ను ప్రూవ్ చేసుకున్న ఘ‌న‌త క్రిష్ ద‌క్కించుకోగ‌లుగుతాడు.