సినిమా వార్తలు

'ఎఫ్ 2' అతిథి పాత్రలో అనిల్ రావిపూడి!


9 months ago 'ఎఫ్ 2' అతిథి పాత్రలో అనిల్ రావిపూడి!

యాక్షన్ తో పాటు ఎమోషన్, కామెడీకి ప్రాధాన్యతనిస్తూ అనిల్ రావిపూడి వరుస విజయాలను నమోదు చేస్తున్నారు. 'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' ఆయన దర్శక ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. తాజాగా ఆయన 'ఎఫ్ 2' సినిమాను రూపొందించారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ కథానాయకులుగా రూపొందిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి అతిథి పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. గతంలో ఆయన 'రాజా ది గ్రేట్' సినిమాలో ఒక పాటలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్ కావడంతో సెంటిమెంట్ గా తీసుకున్నాడో ఏమో 'ఎఫ్ 2'లోను ఆయన కనిపించనున్నాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. కథానాయికలుగా తమన్నా, మెహ్రీన్ కనిపించనున్నారు.