సినిమా వార్తలు

అబ్దుల్ కలాంగా అనిల్ కపూర్


9 months ago అబ్దుల్ కలాంగా అనిల్ కపూర్

అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్, మరోవైపు కోలీవుడ్‌లలో బయోపిక్ ల హవా నడుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల బయోపిక్స్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాయి. ఇక కాంతారావు బయోపిక్ సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అబ్దుల్ కలామ్ బయోపిక్ ను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అబ్దుల్ కలామ్ దేశం గర్వించదగిన గొప్ప సైంటిస్ట్ గా ఎలా ఎదిగారు? అనే విషయంపై ఈ బయోపిక్ ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ కలసి ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేసినట్టుగా చెబుతున్నారు. ఇక ఇందులో అబ్దుల్ కలామ్ గా అనిల్ కపూర్ ను ఎంపికచేశారని తెలుస్తోంది. తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నట్టు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.