సినిమా వార్తలు

రేంజ్‌కు త‌గ్గ అవ‌కాశాలు లేని అన‌సూయ‌


7 months ago రేంజ్‌కు త‌గ్గ అవ‌కాశాలు లేని అన‌సూయ‌

యాంకర్ అనసూయ ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీగా మారుతున్నారు. స్టేజ్ షోల‌లో గ్లామర్ డ్రెస్ ల‌తో సంద‌డి చేసే ఈ యాంకర్ వెండితెరపై డి గ్లామర్ క్యారెక్టర్ల‌ను చేయాల్సివ‌స్తోంది. రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన పాత్ర అంద‌రినీ మెప్పించింది.. ఇక యాత్ర సినిమాలో  అనసూయ  డి-గ్లామర్ పాత్ర‌లో క‌నిపించింది. కానీ ఈ క్యారెక్టర్ అంతగా ఆమెకు క‌ల‌సిరాలేదు. అయితే ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి ఆదరించిన ప్రేక్ష‌కుల‌కు కృతజ్ఞతలని, ఇలాగే మంచి మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటాన‌ని అన‌సూయ చెప్పుకొచ్చింది. నిజానికి ఆ రోల్  ఆమెకు ప్ల‌స్ కాద‌ని చాలామంది అంటున్నారు.. అలాగే F2 లో కూడా అనసూయ చేసిన పాత్రలో కూడా కొత్త‌ద‌నం ఏమి లేదు. అవన్నీ చిన్న‌రోల్స్ కావడంతో అన‌సూయ రేంజ్ ఇది కాదు అంటూ ఆమె అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అనసూయ ఇలాంటి పాత్రలు చేయడం అదృష్టంగా బావిస్తున్నట్లు చెబుతోంది. మ‌రి రానున్న రోజుల్లో అన‌సూయ సినిమాల్లో ఎలాంటి పాత్ర‌ల్లో క‌నిపిస్తుంద‌నేది వేచి చూడాల్సిందే.