సినిమా వార్తలు

‘కథనం’లో అనసూయ లుక్‌ ఇదే!


11 months ago ‘కథనం’లో అనసూయ లుక్‌ ఇదే!

‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర పోషించినప్పటి నుంచి అనసూయ డిమాండ్‌ అమాంతం పెరిగింది! ఆమెను దృష్టిలో పెట్టుకుని దర్శకులు, రచయితలు కథలు రాస్తున్నారు. అటువంటి కథల్లో ‘కథనం’ ఒకటి. ‘కథనం’లో అనసూయ లుక్‌ వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది.  ఇది‘క్షణం’లో ఆమె లుక్‌ని తలపించేలావుంది. అనసూయ అభిమానులకు ఇక్కడ మరో సర్ ప్రైజ్ కూడా ఉంది. ‘కథనం’లో ఒకరికి ఇద్దరు అనసూయలు వున్నార్ట! సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ధనరాజ్‌, ‘వెన్నెల’ కిశోర్‌, జబర్దస్త్‌ బ్యాచ్‌ నటిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను రానా విడుదల చేశారు.