సినిమా వార్తలు

త్వరలో అమీజక్సన్ పెళ్లి


9 months ago త్వరలో అమీజక్సన్ పెళ్లి

‘2.ఓ’లో రోబోగా నటించి అమితంగా ఆకట్టుకున్న అమీ జాక్సన్‌ నూతన జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆమె కొన్ని రోజులుగా బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో డేటింగ్‌లో ఉన్నారు. కొత్త ఏడాదిలో ఆ శుభవార్త చెప్పేశారు. జనవరి 1న వీళ్ల నిశ్చితార్థం జాంబియాలో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘జనవరి 1 నుంచి మన కొత్త ప్రయాణం మొదలైంది.ఐ లవ్యూ. ప్రపంచంలోనే సంతోషంగా ఉండే అమ్మాయిగా నన్ను చేసినందుకు ధన్యవాదాలు’ అని రాశారు. అయితే పెళ్లి ఎప్పుడనేది ప్రకటించలేదు. తెలుగులో ‘ఎవడు’, ‘అభినేత్రి’ చిత్రాల్లో కూడా అమీ నటించారు.