సినిమా వార్తలు

నవంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రానున్న అమర్ అక్బర్ ఆంథోనీ!


10 months ago నవంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రానున్న అమర్ అక్బర్ ఆంథోనీ!

డైరెక్టర్ శ్రీను వైట్ల చాలా కాలం తరువాత ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీ తో ముందుకు రానున్నారు. మాస్ మహా రాజా రవి తేజ ఈ చిత్రం లో త్రిపాత్రాభినయం చేయటం విశేషం. తెలుగులో పరిచయమై బాలీవుడ్ కు  తరలి వెళ్లిన అందాల భామ ఇలియానా ముచ్చటగా మూడోసారి రవితేజ తో జతకట్టనుంది. వీరి కాంబినేషన్ లో 'కిక్' సూపర్ హిట్ గా నిలువగా, 'దేవుడు చేసిన మనుషులు' పరాజయం చవిచూసింది.

అలాగే హీరో గా మారిన కమెడియన్ సునీల్ మరోమారు పూర్తి కామెడీ పాత్రలో అలరించనున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ హెరాయిన్ లయ ఈ చిత్రం తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎంతోమంది కమెడియన్స్ తో , పక్కా శ్రీను వైట్ల కామెడీ పంచ్ లతో ఈ చిత్రం అలరించనుందని అంటున్నారు. నవంబర్ 16 న 'అమర్ అక్బర్ ఆంథోనీ' విడుదలకు సిద్ధంగా ఉంది.