సినిమా వార్తలు

లవర్స్ డే నాడు బన్నీ సినిమా లాంచ్!


8 months ago లవర్స్ డే నాడు బన్నీ సినిమా లాంచ్!

కొంతకాలంగా అల్లు అర్జున్ (బన్నీ)కి సరైన హిట్ లేదు. 'దువ్వాడ జగన్నాథం' ఫరవాలేదనిపిస్తే, 'నా పేరు సూర్య' ఆ స్థాయిని కూడా అందుకోలేకపోయింది. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో బన్నీ ఉన్నాడు. ఈ కారణంగానే ఆయన విక్రమ్ కుమార్, పరశురామ్ లాంటి దర్శకుల ప్రాజెక్టులను సైతం పక్కన పెట్టేసి, త్రివిక్రమ్ తోనే సినిమా చేయడానికి రంగంలోకి దిగారని తెలుస్తోంది. వేలంటైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

ఆ వెంటనే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేసి, దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్- బన్నీ కాంబినేషన్లో 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు వచ్చాయి. ఆ రెండింటిని మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని బన్నీ ఇప్పటికే త్రివిక్రమ్ కి చెప్పేశాడని సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వానిని ఎంపికచేశారనే టాక్ వినిపిస్తోంది.