సినిమా వార్తలు

త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా లేనట్లే?


10 months ago త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా లేనట్లే?

దర్శకుడు త్రివిక్రమ్‌ త్వరలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ చిత్రం క్యాన్సిల్ అయినట్టు తాజా సమాచారం. ఇంతకుముందు బాలీవుడ్‌లో రూపొందిన ఓ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేబోతున్నారని, బన్ని కోసం ఈ చిత్రం కథ రైట్స్‌ను కొనుగోలు చేసేశారనే వార్తలు కూడా వినిపించాయి. దీనికితోడు ఇది కాకుండా త్రివిక్రమ్‌ దగ్గర సొంతంగా ఓ స్క్రిప్ట్‌ రూపొందించారని సమాచారం. అయితే ఈ కథతో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ను త్రివిక్రమ్ మెప్పించలేకపోయారని సమాచారం అందుకే ఈ సినిమా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ ఏడాది నా పేరు సూర్య సినిమాని స‌మ్మ‌ర్ కానుక‌గా మే నెల‌లో విడుద‌ల చేశాడు. ఆ సినిమా అంతగా ఆడ‌లేదు. అప్ప‌ట్నుంచీ అర్జున్ మ‌రో సినిమా ఒప్పుకోలేదు. విక్ర‌మ్‌కుమార్ ఒక క‌థ చెప్పినా.. అది న‌చ్చ‌లేదని ప‌క్క‌న పెట్టాడని సమాచారం.