సినిమా వార్తలు

దుమ్మురేపుతున్న అల్లు అర్జున్ ‘సీటీ మార్’


10 months ago దుమ్మురేపుతున్న అల్లు అర్జున్ ‘సీటీ మార్’

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే అర్జున్ సినిమాలు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తెచ్చుకొని రోజురోజుకు సరికొత్త రికార్డ్ లు సృష్టించాయి. వీటి సరసన బన్నీ నటించిన సాంగ్ కూడా ఓ కొత్త రికార్డ్ ని సృష్టించింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా, కలెక్షన్ల పరంగా చూసుకుంటే విజయభేరి మోగించింది. ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రంలోని ‘సీటీ మార్’ అనే పాట యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఆదిత్య మ్యూజిక్ విడుదల చేసిన ఈ వీడియో సాంగ్ ఏకంగా 90 మిలియన్ వ్యూస్ ను సాధించి రికార్డ్ నెలకొల్పింది. ఇదిలావుండగా బన్నీ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ లో అధికారికంగా ప్రారంభం కానుందని తెలుస్తోంది.