సినిమా వార్తలు

అఖిల్‌కు హిట్ ఇవ్వాల‌నుకుంటున్న అల్లు అర‌వింద్‌


8 months ago అఖిల్‌కు హిట్ ఇవ్వాల‌నుకుంటున్న అల్లు అర‌వింద్‌

అక్కినేని అఖిల్ కు సినిమాల ప‌రంగా కాలం క‌ల‌సిరావ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. తండ్రి నాగార్జున ఎంత కష్ట పడినా అఖిల్ కు స‌రైన‌ హిట్ ని అందించలేక పోతున్నారంటున్నారు. ఇదిలావుంటే తాజాగా అఖిల్ కోసం మెగా ఫ్యామిలీ రంగం లోకి దిగిందే వార్త వినిపిస్తోంది. అల్లు అరవింద్... అక్కినేని అఖిల్ తో ఒక‌ సినిమాను  చేయాలని అనుకుంటున్నార‌ట‌. ఇందుకు ఇద్దరు దర్శకులు కథలతో రెడీగా వున్నార‌ట‌. బొమ్మరిల్లు భాస్కర్, గీతగోవిందం పరుశురామ్. ఈ ఇద్దరినీ ఇప్పుడు అఖిల్ కు కథలు చెప్పమని అరివింద్ పురమాయించార‌ని స‌మాచారం. ఈ రెండు కథల్లో అఖిల్ కు ఏది నచ్చితే ఆ డైరక్టర్ తో సినిమా వుంటుంద‌ని తెలుస్తోంది. అయితే  పరుశుమార్ తోనే అఖిల్‌ సినిమా వుండే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలుస్తోంది. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన పరుశురామ్ అయితేనే బెట‌ర్ అని అర‌వింద్ భావిస్తున్నార‌ట‌. ఇదిలావుంటే గీతగోవిందం లాంటి హిట్ ఇచ్చిన తరువాత బయటకు వెళ్లకుండా, గీతాలోనే వుండేలా చేస్తున్నందుకు దర్శకుడు పరుశురామ్ కాస్త అసంతృప్తిగా వున్నారని బోగట్టా. మ‌రి ఇప్పుడు అఖిల్ ఏమంటారో వేచిచూడాలి.