సినిమా వార్తలు

అల్లు అర్జున్... కొత్త ఆఫీసు ముచ్చట్లు


1 year ago అల్లు అర్జున్... కొత్త ఆఫీసు ముచ్చట్లు

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు అధికమనే విషయిం అందరికీ తెలిసిందే. పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు, ఆశించిన ఫలితాలు రానప్పుడు ఇటువంటి సెంటిమెంట్లు బయటకు రావటం చూస్తుంటాం. అలాంటప్పుడు ఆఫీసులకు వాస్తు దోషాలు వున్నాయేమో అని పండితులను పిలిపించి చూపించుకోవడం లేదా కొత్త ఆఫీసులోకి మారడం మొదలైనవి చేస్తుంటారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, స్టైలిష్ స్టార్ అల్లుడు అర్జున్ ఇప్పుడు ఈ బాటనే అనుసరించారు. మంచి ముహూర్తం చూసుకుని కొత్త ఆఫీసులోకి కాలు మోపారు. సాధారణంగా అల్లు అర్జున్‌ని ఎవరైనా దర్శక నిర్మాతలు కలవాలంటే గీతా ఆర్ట్స్ సంస్థలో కలుస్తుంటారు.  ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తరవాత అల్లు అర్జున్ మరో సినిమా చేయబోతున్నట్టు ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అనుకున్నారు. అది క్యాన్సిల్ అయ్యిందని సమాచారం. అంతకు ముందు కొత్త దర్శకుడితో అనుకున్నారు. అదీ క్యాన్సిల్ అయ్యిందట. తమిళ దర్శకుడు లింగుస్వామితో అనుకున్న తెలుగు, తమిళ సినిమా కూడా క్యాన్సిల్ అయ్యిందని సమాచారం. ఇటువంటి  పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకోసమే అల్లు అర్జున్ కొత్త ఆఫీసు తీసుకుంటున్నారని సినీ జనాలు అంటున్నారని భోగట్టా.