సినిమా వార్తలు

త్రివిక్రమ్ తో సెట్స్ పైకి బన్నీ


11 months ago త్రివిక్రమ్ తో సెట్స్ పైకి బన్నీ

హీరో అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' తరువాత  కొంత గ్యాప్ తీసుకున్నాడు. అతనిని మెప్పించే కథ లభించకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. దర్శకుడు విక్రమ్ కుమార్ ఒక కథ చెప్పినప్పటికీ, సెకండాఫ్ విషయంలో అల్లు అర్జున్ అసంతృప్తిని వ్యక్తం చేశాడని సమాచారం. ఈ నేపథ్యంలో తనకి 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో మరో సినిమా చేయడానికి బన్నీసిద్ధమవుతున్నాడని సమాచారం. ఇప్పటికే బన్నీకి  త్రివిక్రమ్ ఒక కథ వినిపించాడనీ, అది ఒక హిందీ సినిమాకి రీమేక్ అనే వార్తలు వినిపించాయి.

కానీ త్రివిక్రమ్ మాత్రం బన్నీకి కొత్తగా ఒక లైన్ వినిపించి ఓకే అనిపించేసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పూర్తి కథను సిద్ధం చేసే పనిలో త్రివిక్రమమ్ ఉన్నాడని అంటున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడికానున్నాయి.