సినిమా వార్తలు

బన్నీ సరసన కైరా అద్వాని


9 months ago బన్నీ సరసన కైరా అద్వాని

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమాను చేయడం ఖరారైపోయింది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి. తండ్రీ కొడుకుల బంధానికి సంబంధించిన ఎమోషన్ ప్రధానంగా ఈ కథ సాగుతుందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో కథానాయికగా చోటు సంపాదించుకునే అదృష్టవంతురాలు ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

ఈ నేపథ్యంలో కైరా అద్వాని పేరు తెరపైకి వచ్చింది. కథానాయిక పాత్ర కోసం ఈ సినిమా టీమ్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నదని సమాచారం. బన్నీకి జోడీగా ఛాన్స్ అంటే ఆమె కాదనే అవకాశం ఉండదు కనుక, ఆమె ఎంపిక ఖరారైపోయినట్టేననే వార్తలు వినిపిస్తున్నాయి. 'భరత్ అనే నేను' తో తెలుగు తెరకి పరిచయమైన ఈ సుందరి,  'వినయ విధేయ రామ' సినిమాలోనూ నటిస్తోంది.