సినిమా వార్తలు

బోట్ రేస్ కి గౌరవ అతిధి గా అల్లు అర్జున్!


9 months ago బోట్ రేస్ కి గౌరవ అతిధి గా అల్లు అర్జున్!

ఈరోజు ఉదయం అల్ల్లు అర్జున్ కేరళ ప్రభుత్వ ఆహ్వానం అందుకున్నాడని వార్తలు వచ్చాయి. ఆ ఆహ్వానం దేనికోసం అనేది మాత్రం తెలియలేదు. తాజాగా అధికారికంగా విషయం వెల్లడైంది. కేరళ లో నవంబర్ 10 న నెహ్రు ట్రోఫీ బోట్ రేస్ జరగనుంది. దానికి గాను తమ అభిమాన హీరో అల్లు అర్జున్ ని ఆ ప్రభుత్వం గౌరవ అతిధి గా ఆహ్వానించింది. 

కేరళ లో అల్లు అర్జున్ కి ఉన్న ఫాలోయింగ్ ఎంత అంటే, వారు అర్జున్ ని ముద్దుగా మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు. ఈ ఆహ్వానానికి కారణం కేరళ వరద బాధితుల సహాయనిధికి అల్లు అర్జున్ ఉదారంగా పాతికలక్షలు డొనేట్ చేయటమేనట. అందుకు కృతజ్ఞతగా వారు అర్జున్ ను ఆహ్వానించి సత్కరించబోతున్నారని వినికిడి.