సినిమా వార్తలు

మహేశ్ స్టయిల్‌లో అల్లు అర్జున్ మల్టిపెక్స్


10 months ago మహేశ్ స్టయిల్‌లో అల్లు అర్జున్ మల్టిపెక్స్

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలే తన సొంత మల్టిప్లెక్స్ ను ప్రారంభించారు. ఏషియన్ ఫిల్మ్స్ సంస్థ భాగస్వామ్యంతో మహేశ్ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ‘ఏఎంబీ సినిమాస్’ పేరుతో నిర్మించిన ఈ  మల్టిపెక్స్ కు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దీంతో నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నట్లు సమాచారం. ఇదేవిధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మహేష్ బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. మల్టిప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు బన్నీ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అమీర్ పేట వద్ద ఉన్న సత్యం థియేటర్ స్థానంలో మల్టిప్లెక్స్ కట్టేందుకు అల్లు అర్జున్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పినట్టు భోగట్టా. అలాగే బంజారాహిల్స్ లోని సిటీ సెంటర్ లోనూ మల్టిప్లెక్స్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అల్లు అర్జున్ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత బన్నీ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు సైన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ విషయమై ఇంకా త్రివిక్రమ్, బన్నీల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.