సినిమా వార్తలు

అల్లు అర్జున్... దసరా అల్లుడు


11 months ago అల్లు అర్జున్... దసరా అల్లుడు

దసరా పండుగ సందర్భంగా అత్తగారింటికి హీరో అల్లు అర్జున్ వెళ్లాడు . తన భార్య స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామమైన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి గ్రామానికి అల్లు అర్జున్ చేరుకున్నాడు. కుటుంబ సమేతంగా వెళ్లి, సందడి చేశారు. తమ ఊరికి అల్లు అర్జున్ వచ్చాడని తెలియడంతో ఆయన అత్తగారి ఇంటి వద్ద ఎంతో సందడి నెలకొంది. అల్లు అర్జున్ ను చూసేందుకు గ్రామమంతా తరలి వచ్చింది. సెల్పీలు, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. తనకు దసరా శుభాకాంక్షలు చెప్పినవారందరికీ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు.