సినిమా వార్తలు

కేరళ కు అతిధి గా అల్లు అర్జున్!


11 months ago కేరళ కు అతిధి గా అల్లు అర్జున్!

అల్లు అర్జున్ కు ఉత్తరాది నుండి దక్షిణాది వరకు చాల పెద్ద ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం విదితమే. తన దుబ్బింగ్ చిత్రాలకు హిందీ లోను, దక్షిణాది భాషలలోను కూడా మంచి ఆదరణ ఉంది. ప్రత్యేకించి కేరళలో తనకి ఎందరో అభిమానులున్నారు. ఈ నేపధ్యం లో ఆ మధ్య వచ్చిన కేరళ వరదల విషయం లో కూడా అర్జున్ స్పందించి పాతిక లక్షలు విరాళంగా కేరళ ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా కేరల ప్రభుత్వం నుంచి ఆలు అర్జున్ ఆహ్వానం అందుకున్నట్లు సమాచారం. అది ఒక అధికారిక కార్యక్రమం కోసం అని అంటున్నారు. అయితే కేరళ ప్రభుత్వం వరద సమయంలో చేయూతనిచ్చిన సెలెబ్రిటీలను అందరిని సన్మానించే ఆలోచనలో ఉండగా, ఈ ఆహ్వానం దాని గురించేనా లేక వేరే ఏదైనా కారణం ఉన్నదా అనేది తెలియవలసి ఉంది. 

 నా పేరు సూర్య తరువాత తదుపరి కధ ఎంపిక లో తగిన జాగ్రత్త వహించాలని నిర్ణయించుకున్న అర్జున్ సరైన కధ కోసం చాలా కాలమే వేచిఉన్నాడు. త్వరలో తదుపరి చిత్రం ప్రారంభం కానుంది. కాగా ఆ వివరాలు అధికారికంగా వెల్లడి కావలసి ఉంది.