సినిమా వార్తలు

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా ఖరారు


9 months ago అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా ఖరారు

అల్లు అర్జున్ తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉంటుందా అనే ఆసక్తితో ఆయన అభిమానులంతా చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అర్జున్ తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే వుండనుందనేది తాజాగా ఖరారయినట్లు తెలుస్తోంది. 'నా పేరు సూర్య' పరాజయం తరువాత అల్లు అర్జున్ ఆలోచనలో పడ్డారు. ఈ సారి తప్పకుండా సరైన హిట్ కొట్టాలని ఆయన భావించారు. అలాంటి హిట్ ను తనకి త్రివిక్రమ్ అందించగలరనే నమ్మకం పెట్టుకున్నారు. అందుకోసమే త్రివిక్రమ్ ఫ్రీ అయ్యేంతవరకూ వెయిట్ చేశాడు. ఈలోగా విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళతారనే వార్తలు వినిపించాయి.

ఆ తరువాత పరశురామ్, సంకల్ప్ రెడ్డి పేర్లు కూడా కూడా వినిపించాయి. ఈ ప్రచారానికి తెరదించుతూ అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ తోనే చేయనున్నారనే విషయం అధికారికంగా తెలియవచ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో భాగస్వాములు కానుంది. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది త్రివిక్రమ్,అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూడవ చిత్రం.