సినిమా వార్తలు

అల్లరి నరేష్ నెక్స్ట్ ప్లానిదే!


7 months ago అల్లరి నరేష్ నెక్స్ట్ ప్లానిదే!

గ‌త కొంతకాలంగా అల్లరి నరేష్ కు ఒక్క హిట్ కూడా ప‌డ‌లేదు, ఎన్ని కథలు మార్చి చేసినా హిట్ ద‌క్కించుకోలేక‌పోయాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో కలసి మహర్షి సినిమా లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా క‌నిపించ‌నున్నాడు. ఈ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుంద‌ని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. ఇక ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ మళ్ళీ సోలో హీరోగా రాబోతున్నాడ‌ని స‌మాచారం. కాకపోతే ఈసారి కామెడీని కాకుండా క్రైమ్ ని నమ్ముకున్నాడ‌ని తెలుస్తోంది. బెట్టింగ్ బంగార్రాజు, యముడికి మొగుడు, జంప్ జిలాని త‌దిత‌ర‌ సినిమాలు నరేష్ తో చేసిన సత్తిబాబు దర్శకత్వంలో ఓ క్రైమ్ సినిమా రానున్న‌ద‌ని తెలుస్తోంది. ఈ సినిమాకి కథ, డైలాగ్స్ విక్రమ్ రాజ్ అందిస్తున్నారట. లక్ష్య ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్న‌ద‌ని స‌మాచారం ఈ చిత్రాన్ని మే నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.