సినిమా వార్తలు

'పేట' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అంతా సిద్దం


8 months ago 'పేట' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అంతా సిద్దం

తమిళనాట అజిత్ సినిమా 'విశ్వాసం'తో పోటీపడటానికి రజనీ 'పేట' మరింత ఉత్సాహంగా రంగంలోకి దిగిపోయింది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లకు రానుంది. అదే రోజున ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా పలుకరించనుంది. తెలుగులో గట్టిపోటీ ఉన్నప్పటికీ, 'పేట' ఏమాత్రం వెనకడుగు వేయకుండా వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి ముహూర్తాన్ని ఖరారు చేసింది.

ఈ నెల 6న ఆదివారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ - సైబర్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పలువురు సినీప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని అందించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా తదితరులు ఉండటంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.బాబీ సింహా తదితరులు ఉండటంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.