సినిమా వార్తలు

అలీ సంచలన నిర్ణయం


8 months ago అలీ సంచలన నిర్ణయం

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ వైసీపీలో చేరుతున్నారనే వార్త సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. జనవరి 9న జగన్ పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న భారీ సభలో అలీ వైసీపీలో చేరనున్నారు. డిసెంబర్ 28న శంషాబాద్ ఎయిర్ పోర్టులో జగన్ ను అలీ కలిశారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరాలనే ఆకాంక్షను జగన్ వద్ద వ్యక్తం చేశారు. అలీ రాజమండ్రికి చెందిన వ్యక్తి కావడంతో, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వైసీపీ పార్టీ బలోపేతం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అలీ సినీ గ్లామర్ పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. అదేవిధంగా పార్టీ ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అలీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.