సినిమా వార్తలు

విహార యాత్రల్లో అక్కినేని ఫ్యామిలీ


1 year ago విహార యాత్రల్లో అక్కినేని ఫ్యామిలీ

అక్కినేని స్టార్స్ నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత, చివరాఖరికి అఖిల్ కూడా స్పెయిన్ లో ఎంజా చేయనున్నట్లు తెలుస్తోంది.  చైతూ సినిమా `శైల‌జారెడ్డి అల్లుడు`, స‌మంత సినిమా `యూట‌ర్న్` ఇటీవ‌లే విడుద‌ల‌య్యాయి. ప్ర‌మోష‌న్లు ముగించుకుని ఈ జంట స్పెయిన్ వెళ్లిపోయింది. అక్క‌డో ఐలాండ్‌లో ప్రస్తుతం హాయిగా గ‌డుపుతోందని సమాచారం. ఇప్పుడు నాగ్, అమ‌ల‌, అఖిల్.. కూడా అదే ఐలాండ్‌కి వెళ్ల‌బోతున్నారు. అంటే.. నాగ్ ఫ్యామిలీ మొత్తం ఆ ఐలాండ్ లోనే కొన్ని రోజులు ఉండ‌బోతున్నార‌ని తెలుస్తోంది‌.

అటు నాగ్‌, ఇటు స‌మంత చేతిలో బోలెడ‌న్ని సినిమాలున్నాయి. అఖిల్ కి కూడా `మిస్ట‌ర్ మ‌జ్ను` షూటింగ్ ఉంది. వాటికి కొంత‌కాలం బ్రేక్ ఇచ్చి.. ఇలా ఫ్యామిలీ అంతా విహార యాత్రల్లో మునిగి తేలుతోంది‌. క‌నీసం వారం రోజులు ఐలాండ్‌లోనే ఉండాల‌ని నాగ్ అండ్ ఫ్యామిలీ భావిస్తోందని సమాచారం. అక్క‌డ్నుంచి తిరిగొచ్చాక‌.. ఎవ‌రి షూటింగుల్లో వాళ్లు మ‌ళ్లీ బిజీ అవుతారట. సినిమాలు, వ్యాపారాల‌తో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకంటూ నాగ్ కొంత టైమ్ కేటాయిస్తుంటారు. ఓ సినిమా పూర్త‌యిన వెంట‌నే ఫ్యామిలీ ట్రిప్ వేయ‌డం నాగ్‌కి అల‌వాటు.