సినిమా వార్తలు

సుమంత్ తో అక్కినేని బయోపిక్?


8 months ago సుమంత్ తో అక్కినేని బయోపిక్?

ఎన్టీఆర్ బయోపిక్ కి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడే ఏఎన్నార్ బయోపిక్ కి సంబంధించిన ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఏఎన్నార్ బయోపిక్ కు సంబంధించిన ప్రశ్నలు నాగార్జునకు ఎదురయ్యాయి. ఏఎన్నార్ జీవితం చాలా సాఫీగా సాగిపోయిందనీ, అందువలన ఆయన బయోపిక్ ను తెరకెక్కిస్తే డ్రామా లేదంటూ ప్రేక్షకులు తిరస్కరించే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాన్ని నాగార్జున ఆ మధ్య వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఏఎన్నార్ బయోపిక్ విషయంలో నాగార్జున మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. అయితే సినిమా తీశాక లాభనష్టాల సంగతి అటుంచితే, తరువాత తరాలవారికి ఏఎన్నార్ గురించిన జీవిత విశేషాలను అందిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారట. రీసెంట్ గా ఈ విషయమై నాగార్జున కుటుంబ సభ్యులంతా కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ గా సుమంత్ లుక్ ప్రశంసలు అందుకోవడంతో, బయోపిక్ అంటూ తీస్తే సుమంత్ తోనే తీయవచ్చనే  టాక్  ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.