సినిమా వార్తలు

అకీరా హీరోలా వస్తాడు


4 months ago అకీరా హీరోలా వస్తాడు

తన కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రకటించారు. అకీరాలో ఉన్నది పవన్ రక్తమేనని, ఆ రక్తంలోనే నటన ఉందని అన్నారు. అకీరా సినిమాల్లోకి రావడంపై తాను ఎంతమాత్రం అభ్యంతరం చెప్పనని, అయితే అంతకుముందు తన చదువును పూర్తి చేయాలన్నారు. అకీరా వయసు 14 సంవత్సరాలని, హీరో అయ్యే టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తాడని చెప్పారు. అకీరాపై పెదనాన్న చిరంజీవి, అన్నయ్య రామ్ చరణ్ ల ప్రభావం కూడా ఉందన్నారు.