సినిమా వార్తలు

ఫినిషింగ్‌ టచ్ లో ‘మిస్టర్‌ మజ్ను’


10 months ago ఫినిషింగ్‌ టచ్ లో ‘మిస్టర్‌ మజ్ను’

ప్రేమ కోసం లండన్ చుట్టివ‌చ్చిన హీరో అఖిల్  ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ ప్రేమ ప్రయాణం చేశాడు. ప్రసుతం ఈ ప్రయాణం ముగింపు దశకు చేరుకుంద‌ని స‌మాచారం. డిసెంబర్‌ మొదటివారంలోపు ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయబోతున్నాం అని అఖిల్  చెప్పారు. ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’. నిధీ అగర్వాల్ హీరోయిన్‌. బీవీఎస్ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

‘‘సినిమాకు సంబంధించిన ప్యాచ్‌వర్క్‌ ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతోంది. డిసెంబర్‌ 3వ తేదీకి టాకీ పార్ట్‌ పూర్తి చేస్తాం. కేవలం ఒక్క సెట్‌ సాంగ్‌ మినహా షూటింగ్‌ కంప్లీట్‌ అయింది. జనవరిలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం. సినిమా అప్‌డేట్స్‌ కోసం ఓపికగా ఎదురుచూస్తున్నందుకు అభిమానులకు థ్యాంక్స్‌. ఇక ప్రమోషన్స్‌ టైమ్‌ స్టార్ట్‌ అయింది’’ అని పేర్కొన్నారు అఖిల్‌. ఈ సినిమాని జనవరి 25న రిలీజ్‌ చేయడానికి చిత్రబృందం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంగీతాన్ని తమన్ స‌మకూర్చారు.