సినిమా వార్తలు

ఫస్టు సాంగ్ తో 'మిస్టర్ మజ్ను' పలకరింపు


9 months ago ఫస్టు సాంగ్ తో 'మిస్టర్ మజ్ను' పలకరింపు

'తొలి ప్రేమ' సినిమాతో విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి, తరువాత కథ కూడా ప్రేమ కథా చిత్రాన్నే ఎంపిక చేసుకున్నారు. ఆ రొమాంటిక్ లవ్ స్టోరీని 'మిస్టర్ మజ్ను' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అఖిల్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన జోడీగా నిధి అగర్వాల్ అలరించనుంది. ఈ సినిమాలోని 'ఏమైనదో' అనే ఒక సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. ఈ నెల 25వ తేదీన టీజర్ ను, జనవరి 25వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారని సమాచారం. అఖిల్ గతంలో చేసిన రెండు సినిమాలు ఆశించినస్థాయి ఫలితాలను అందించకపోవడంతో, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా అఖిల్ ఆశలు నెరవేరుతాయేమో వేచిచూడాలి.