సినిమా వార్తలు

అఖిల్ సరసన ప్రియా వారియర్‌


1 year ago అఖిల్ సరసన ప్రియా వారియర్‌

అక్కినేని నట వారసుడు అఖిల్ తో  ప్రియా వారియర్ సౌతిండియా షాపింగ్ మాల్ కోసం తీసిన ఓ వ్యాపార ప్రకటనలో నటించారు. ఇక వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసిన వారంతా ఈ జోడీ బాగుందని కితాబిస్తున్నారు. కాగా, ప్రస్తుతం అఖిల్ 'మజ్ను' చిత్రంతో బిజీగా ఉండగా, 'ఒరు ఆధార్ లవ్' తరువాత ప్రియా వారియర్ మరో చిత్రానికింకా సైన్ చేయలేదని తెలుస్తోంది. ఇదిలావుండ‌గా ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలోని ‘‘మాణిక్య మలరాయ’’ పాటతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది ప్రియావారియ‌ర్‌. ఈ పాటలో కన్నుకొట్టడం సహా ప్రియా చూపిన హావభావాలకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఒక్కరోజులోనే వైరల్ గా మారిన ఈ పాటకు పెద్ద ఎత్తున లైకుల వర్షం కురిపించారు నెటిజన్లు. అంతేకాదు ప్రియాను సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఫాలో అయ్యారు. ఇదిలాఉంటే.. తాజాగా ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రం నుంచి మరోపాట ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ సారి ఏమాత్రం అంతకుముందు జరిగిన దానికి భిన్నంగా లైకుల కంటే డిస్ లైకులు కురిపిస్తూ పెద్ద ఎత్తున వ్యతిరేకత చూపుతున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు ఈ డిస్ లైకుల టార్గెట్ 10 లక్షలు అని కూడా పేర్కొంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇలా చూస్తే ప్రియా ఈ రకంగా కూడా రికార్డు దిశగా దూసుకెళ్తోందని తెలుస్తోంది.