సినిమా వార్తలు

బోయపాటితో అఖిల్ సినిమా


11 months ago బోయపాటితో అఖిల్ సినిమా

అక్కినేని అఖిల్ తన మూడవ సినిమాను వెంకీ అట్లూరితో చేస్తున్నాడు. 'మిస్టర్ మజ్ను' పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కథ రీత్యా ఈ సినిమా విదేశాల్లో అధికంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా తరువాత అఖిల్ ఏ దర్శకుడితో చేయనున్నాడనే ప్రశ్నకి సమాధానంగా బోయపాటి పేరు వినిపిస్తోంది.బోయపాటి తన దర్శకత్వంలో చరణ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తరువాత ఆయన బాలకృష్ణతో ఒక సినిమా చేయనున్నారిని తెలుస్తోంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటంతో, రెండు మూడు నెలల్లోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేయగలననే నమ్మకంతో వున్నాడట. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే ఆయన అఖిల్ తో చేయనున్నాడనీ, నాగార్జున కోరిక మేరకు బోయపాటి కథను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుందని స‌మాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్ల‌డికానున్నాయి.