సినిమా వార్తలు

జాకీగా అఖిల్!


12 months ago జాకీగా అఖిల్!

అఖిల్ తన 3వ సినిమాగా 'మిస్టర్ మజ్ను' చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తరువాత రొమాన్స్ తో కూడిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీని అఖిల్ చేయనున్నట్టు సమాచారం. ఆది పినిశెట్టి సోదరుడు 'సత్య ప్రభాస్' ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఆయన అఖిల్ కి కథ వినిపించడం .. అఖిల్ ఓకే చెప్పేయడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఈ సినిమాలో అఖిల్ గుర్రపు స్వారీ చేసే 'జాకీ'గా కనిపించనున్నాడని అంటున్నారు. కథా కథనాల్లోని కొత్తదనం కారణంగానే ఈ సినిమాను అఖిల్ అంగీకరించాడని చెబుతున్నారు. కథానాయిక ఎవరనే విషయం త్వరలోనే వెల్లడికానుంది.