సినిమా వార్తలు

కోలీవుడ్‌లోనూ అఖిల్‌ ‘హలో’


9 months ago కోలీవుడ్‌లోనూ అఖిల్‌ ‘హలో’

టాలీవుడ్ హీరో నాగార్జున తనయుడు అఖిల్‌ తెలుగులో నటించిన ‘హలో’ తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్‌ వారసురాలు కల్యాణి హీరోయిన్‌గా తెర‌పై కాలుమోపుతోంది. అందమైన ప్రేమకథతో తెరకెక్కిన ‘హలో’ తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్‌ ప్రేక్షకులకూ అందించాలని లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌ బ్యానర్‌పై తమిళంలోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సీనియర్‌ నటులు జగపతిబాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.