సినిమా వార్తలు

తార‌క్ నటనకు అఖిల్‌, సాయి ధరమ్ ప్ర‌శంస‌లు


11 months ago తార‌క్ నటనకు అఖిల్‌, సాయి ధరమ్ ప్ర‌శంస‌లు

మాట‌ల‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ కాంబినేష‌న్‌లో వచ్చిన చిత్రం `అర‌వింద స‌మేత‌`. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా విజయవంతమైంది. ముఖ్యంగా ఎన్టీయార్ న‌ట‌న‌, త్రివిక్ర‌మ్ ర‌చ‌న‌కు ప్ర‌శంస‌లు అందుతున్నాయి. సినీ ప్ర‌ముఖులు కూడా `అర‌వింద స‌మేత‌`పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా అక్కినేని యంగ్ హీరో అఖిల్ కూడా `అర‌వింద సమేత‌` సినిమాను ట్విట‌ర్ ద్వారా ప్ర‌శంసించాడు. `తార‌క్ ఎంత గొప్ప న‌టుడో `అర‌వింద స‌మేత‌` చిత్రం మ‌రోసారి మ‌నంద‌రికీ గుర్తు చేసింది. ఎన్టీయార్ న‌ట‌న అద్భుతం. ఈ విజ‌యానికి ఆయ‌న అర్హుడు. త్రివిక్ర‌మ్ న‌మ్మ‌కానికి హ్యాట్సాఫ్‌. థ‌మ‌న్ ఈ సినిమాకు ప్రాణం పోశాడు. పూజా హెగ్డే న‌ట‌న‌, డ‌బ్బింగ్ అద్భుతం. చిత్ర‌బృందానికి అభినంద‌న‌లు. విజ‌యాన్ని ఆస్వాదించండి` అని అఖిల్ ట్వీట్ చేశాడు.  అలాగే సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ది బెస్ట్ ఇచ్చారని సాయి ధరమ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘‘అరవింద సమేత’ ఒక ది బెస్ట్ ఇచ్చేందుకు నటీనటులు ప్రదర్శించిన డెడికేషన్... డైరెక్టర్ కన్విక్షన్... నిర్మాత కమిట్‌మెంట్.. టీం మొత్తానికి శుభాకాంక్షలు. తారక్ నీ నటన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. జగపతిబాబు సార్ మీ నటన అద్భుతం’’ అంటూ సాయి ధరమ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.