సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్’ పై అజయ్ దేవగన్ క్లారిటీ


7 months ago ఆర్ఆర్ఆర్’ పై అజయ్ దేవగన్ క్లారిటీ

రాజ‌మౌళి ‘బాహుబ‌లి’ సినిమాతో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌రువాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలు. ఇటీవ‌లే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. సినిమా రెండో షెడ్యూల్‌ ప్రారంభంకాబోతోంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ న‌టిస్తున్నారని రెండు రోజులు క్రితం వార్త‌లు వినిపించాయి. ‘ఆర్ఆర్ఆర్’లో అజ‌య్ దేవ‌గ‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు రావ‌డంతో ఇది నిజ‌మేనని సినీ జనం భావించారు. తాజాగా ఈ వార్త‌ల‌పై అజ‌య్ దేవ‌గ‌న్ స్పందించారు. తాను రాజ‌మౌళి  ‘ఆర్ఆర్ఆర్’లో న‌టించ‌డం లేద‌ని,ఈ సినిమాలో న‌టించ‌మ‌ని ఎవ‌రూ తనను సంప్రదించ‌లేద‌ని చెప్పారు. అయితే రాజ‌మౌళి సార్ న‌టించ‌మ‌ని అడిగితే త‌ప్ప‌కుండా న‌టిస్తానని తెలిపారు. త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న భార‌తీయుడు 2లో న‌టించ‌మ‌ని తనను కోరార‌ని అజ‌య్ దేవ‌గ‌న్ పెర్కోన్నారు.