సినిమా వార్తలు

సాహో' లో ఎయిర్ టెల్ 4జీ సుంద‌రి?


1 year ago సాహో' లో ఎయిర్ టెల్ 4జీ సుంద‌రి?

ఎయిర్ టెల్ 4జీ యాడ్స్ లో కనిపించే అమ్మాయి అనగానే త‌న హ‌వ‌భావాల‌నే అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. ఆ అమ్మాయి పేరు 'సాషా చెత్రీ. ఎయిర్ టెల్ యాడ్స్ లో కనిపించే ఆ అమ్మాయి నవ్వు .. ఆమె కళ్లలోని మెరుపు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. అలాంటి ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వివిధ భాషల నుంచి సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ అమ్మాయికి తెలుగులో ఒక అవకాశం దక్కేసింది. అడవి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తోన్న ఒక సినిమాలో ఈ అమ్మాయి నటిస్తోంద‌ని స‌మాచారం. ఇక రెండవ ఛాన్స్ ను ఏకంగా 'సాహో' లోనే కొట్టేసింది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను ఈ అమ్మాయి అయితే బాగుంటుందని భావించి సంప్రదించారట. ప్రభాస్ మూవీ అనగానే ఈ అమ్మాయి వెంటనే ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. బహు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనుండటం వలన, ఈ అమ్మాయి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది.