సినిమా వార్తలు

నాగార్జున మేనకోడలితో అడవి శేష్ వివాహం?


7 months ago నాగార్జున మేనకోడలితో అడవి శేష్ వివాహం?

అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియకు యంగ్ హీరో అడవి శేష్ తో వివాహం కాబోతున్నట్లు పరిశ్రమలో ఓ వార్త వినిపిస్తోంది. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నార‌ట‌.. ఇటీవల అడవి శేష్ కూడా త్వరలో ఓ పెద్ద అనౌన్స్ మెంట్ చేయబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విష‌యం విదిత‌మే. అప్పుడు కూడా నెటిజన్స్ పెళ్లి వార్త చెప్పబోతున్నావా అని కామెంట్స్ రాశారు. ఈ క్రమంలో నిజంగానే అడవి శేష్ పెళ్లి వార్తలు వెలుగులోకి వచ్చాయి. సుప్రియతో అడవి శేష్ పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారని భోగ‌ట్టా. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్న‌ద‌ని తెలుస్తుంది. ఈ వ్యవహారాలన్నీ తానె దగ్గరుండి చూసుకుంటానని అక్కినేని కోడలు సమంత భ‌రోసా ఇచ్చింద‌ట‌.