సినిమా వార్తలు

యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ఏకిపారేసిన ల‌య‌


7 months ago యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ఏకిపారేసిన ల‌య‌

`క్యాస్టింగ్ కౌచ్`అంశం కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ఒక‌ ఇంటర్వ్యూలో మాజీ హీరోయిన్ లయ స్పందించారు. “అప్పట్లో సైతం క్యాస్టింగ్ కౌచ్ వుండేదని, చిన్నస్థాయిలో జరిగేదని విన్నాను. సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్ ఇలా చాలా రంగాల్లో అమ్మాయిలను లోబరుచుకోవాలనుకుంటారు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడుతుంటార‌ని ల‌య పేర్కొంది. అయితే సినిమా ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తారో అర్థం కావడం లేదని పేర్కొంది. కాగా యూట్యూబ్ మీడియాపై లయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు హీరోయిన్ బయటకు వెళితే ఎవరు షూట్ చేస్తారో, ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏమని రాస్తారో ఎవ‌రికీ తెలియ‌ద‌న్నారు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో నేను మాట్లాడుతున్న‌ తెలుగు బాలేదని రాశారు. నా మాట తీరే అంత. అసలు తెలుగు ఎంతమంది స్పష్టంగా మాట్లాడుతున్నారు? ఆడియో, సినిమా ఫంక్షన్లలో చాలామంది అభ్యంత‌ర‌క‌రంగా మాట్లాడుతున్నారు. వాళ్ళను ఎందుకు నిలదీయరు? అని ల‌య ప్ర‌శ్నించారు. చివ‌రికి ఫేస్‌బుక్‌లో ఫ్యామిలీ ఫొటోలు పోస్ట్ చేయాలన్నా భయంగా ఉంటోందని ల‌య త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.