సినిమా వార్తలు

నటుడు వైజాగ్‌ ప్రసాద్ కన్నుమూత


9 months ago నటుడు వైజాగ్‌ ప్రసాద్ కన్నుమూత

రంగస్థల, వెండితెర సీనియర్‌ నటుడు వైజాగ్‌ ప్రసాద్‌(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రిలో అంతిమ శ్వాస తీసుకున్నారు. కళా రంగంలో వైజాగ్‌ ప్రసాద్‌గా స్థిరపడిన ఆయన స్వస్థలం విశాఖపట్నంలోని గోపాలపట్నం. ఆయన అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు.

ఆయనకు కుమార్తె రత్నప్రభ, కుమారుడు రత్నకుమార్‌ ఉన్నారు. 1963లో నాటక రంగంలోకి ప్రవేశించిన వైజాగ్‌ ప్రసాద్.. అప్పు పత్రం, భలే పెళ్లి, భజంత్రీలు, కాల ధర్మం, ఆకలి రాజ్యం, హెచ్చరిక, వేట కుక్కలు, కాలకూటం, ఋత్విక్‌, గరీబీ హఠావో లాంటి నాటికలతో ప్రేక్షకుల అభినందనలు చూరగొన్నారు. సుమారు 700 నాటికల్లో నటించిన ఆయన 1983లో బాబాయ్‌ అబ్బాయ్‌ సినిమా ద్వారా ఇండస్ట్రీలో కాలుమోపారు. నువ్వు నేను, జై చిరంజీవ, నీరాజనం, జెమిని, అల్లరి బుల్లోడు, సుందరకాండ, రాణిగారి బంగ్లా తదితర చిత్రాల్లో వైజాగ్ ప్రసాద్ నటించారు.