సినిమా వార్తలు

తారక్ కు తిరుగులేదు: సుమంత్


10 months ago తారక్ కు తిరుగులేదు: సుమంత్

సుమంత్ హీరోగా 'సుబ్రహ్మణ్యపురం' సినిమా రూపొందింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ లో సుమంత్ బిజీ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో తాను పోషించిన పాత్ర, ఇంతవరకూ తాను చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా ఉంటుందని అన్నారు.

ఈ సినిమా తనకు తప్పకుండా విజ‌యాన్ని తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో ఎన్టీఆర్ గురించిన ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు సుమంత్ తనదైన శైలిలో స్పందిస్తూ .. 'తారక్ తో నాకు ఎంతో సాన్నిహిత్యం వుంది. నేను ముద్దుగా ఆయనని 'బావా' అని పిలుస్తుంటాను. ఎలాంటి పాత్రను ఇచ్చినా తారక్ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తాడు. ఆయన చేయలేని పాత్రంటూ ఉండదుగ అని పేర్కొన్నాడు.