సినిమా వార్తలు

గొప్పమనసు చాటుకున్న సుమన్


8 months ago గొప్పమనసు చాటుకున్న సుమన్

ఇటీవలే 40 వసంతాల  సినీ వేడుకను రాజమహేంద్రవరంలో జరుపుకున్న సుమన్ తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నారు. తన సీనీ జీవితంలో ఎన్నో ఆటుఫోటులను ఎదుర్కొన్న హీరో సుమన్ చిన్నపట్టి నుంచి ఇతరులకు సాయం చేసే గుణాన్ని కలిగివున్నారు, తాను సహాయం చేసిన 10 మందిలో ఒకరైనా తాను చేసిన సహాయాన్ని మంచితనంతో అర్థం చేసుకుంటే చాలని గతంలో సుమన్ పేర్కొన్నారు. ఇటీవలే సుమన్ ఆధ్యాత్మిక నట ప్రవీణ అవార్డును కూడా అందుకున్నారు. దేశభక్తి కలిగిన సుమన్ భువనగిరి లో తనకున్న 170 ఎకరాలు భూమిని దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్న జవాన్లకు దానం చేశారు.