సినిమా వార్తలు

పరువు హత్యపై హీరో రామ్ మండిపాటు


1 year ago పరువు హత్యపై హీరో రామ్ మండిపాటు

అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన మిర్యాలగూడెం పరువు హత్యపై  సినీ రంగ ప్రముఖులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రణయ్ ని చంపించిన అమృత తండ్రిపై ఒకొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సంఘటనపై స్పందించాడు. ట్విట్టర్ లో రామ్.. ఒక పక్క సెక్షన్ 377 ను ఎత్తి వేస్తుంటే మరోపక్క కులాలు పట్టుకుని వేలాడటం ఏంటి - ఇంకా పరువు హత్యలు ఏంట్రా జంగిల్ ఫెలోస్ అంటూ తన ఆగ్రహంను వ్యక్తం చేశాడు. మానవత్వం నేర్చుకోవాలంటూ కులాలు పట్టుకుని వేలాడుతున్న వారికి రామ్ సలహా ఇచ్చాడు.

ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ పరువు హత్యపై స్పందించారు. సింగర్ చిన్మయి మాట్లాడుతూ ఇలాంటి పరువు హత్యలు తగ్గాలంటే తమ పేర్ల తర్వాత ఉన్న తోకలు కట్ చేసుకోవాలంటూ సూచించింది. ఇక రామ్ ప్రస్తుతం ‘హలో గురు ప్రేమకోసమే’చిత్రంలో నటిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రంను నిర్మిస్తున్నాడు. దసరాకు ఈ చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రామ్ కు ఈ చిత్రం ఆ సక్సెస్ ను తెచ్చి పెడుతుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.