సినిమా వార్తలు

యాక్షన్ సినిమాలు చేయాలని వుంటుంది: వరుణ్ తేజ్


9 months ago యాక్షన్ సినిమాలు చేయాలని వుంటుంది: వరుణ్ తేజ్

సాధారణంగా యువ హీరోలు లవ్ అండ్ యాక్షన్ సినిమాలకి ప్రాధాన్యతనిస్తుంటారు. అయితే వరుణ్ తేజ్ అందుకు పూర్తి భిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. 'కంచె', 'ఫిదా' .. ఇలా విభిన్నమైన కథా చిత్రాలను చేస్తూ వస్తున్నాడు. 'అంతరిక్షం' సినిమాలో ఆయన వ్యోమగామిగా ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ "మిగతా యంగ్ హీరోల మాదిరిగానే నాకు కూడా యాక్షన్ సినిమాలు చేయాలని ఉంటుంది. గాల్లోకి ఎగిరిపడుతూ రౌడీలతో ఫైట్ చేయాలని ఉంటుంది.

సంకల్ప్ రెడ్డి నుంచి అలాంటి కథనే నేను ఆశించాను. కానీ ఆయన ఈ కథ చెప్పినపుడు ఒప్పుకుని కాదనకుండా చేశాడు. ఈ సినిమాలో పాటలు, కామెడీ సీన్స్ పెట్టొచ్చు. కానీ సంకల్ప్ రెడ్డి కథను పట్టుగా నడిపించడంపైనే పూర్తి దృష్టి పెట్టారు. కచ్చితంగా ఈ సినిమా నా కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకం వుంది" అని వరుణ్ తేజ్ చెప్పాడు.