సినిమా వార్తలు

రకుల్ ‘ఆకుచాటు పిందె’.. తమన్నా‘‘ఆరేసుకోబోయి’


11 months ago రకుల్ ‘ఆకుచాటు పిందె’.. తమన్నా‘‘ఆరేసుకోబోయి’

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను 'కథానాయకుడు' .. 'మహానాయకుడు' అనే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కథానాయకుడిగా ఎన్టీఆర్ .. శ్రీదేవితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. దాంతో ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో 'వేటగాడు' ఒకటిగా నిలిచింది. ఇందులోని 'ఆకుచాటు పిందె తడిసే' పాట ఎప్పటికీ ఎవర్ గ్రీనే. శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ను తీసుకున్న క్రిష్, రీసెంట్ గా ఈ పాటను బాలకృష్ణ - రకుల్ పై చిత్రీకరించారు.  రకుల్ పుట్టినరోజు సందర్బంగా ఫస్టు లుక్ ను విడుదల చేసి టీమ్, 'ఆకు చాటు పిందె తడిసే' పాటలోని స్టిల్ ను కూడా విడుదల చేసింది. నందమూరి అభిమానులను మరింత హుషారెత్తించేలా ఈ పోస్టర్ లుక్ వుంది. మరోవైపు ఈ చిత్రంలో జయప్రద పాత్ర కోసం రాశి ఖన్నాను సంప్రదించినట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా జయప్రద పాత్ర కోసం తమన్నాను సంప్రదించినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో జయప్రద పాత్ర ఐదు నిమిషాల పాటు ఉంటుందని అంటున్నారు. ఈ పాత్రను చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం 3 రోజుల పాటు డేట్లు కేటాయించినట్టు సమాచారం. తమన్నాతో ‘అడవిరాముడు’ సినిమాలోని జయప్రద ‘ఆరేసుకోబోయి.. పారేసుకున్నాను’ సాంగ్‌ను రీమిక్స్ చేయనున్నారట. ఇక జయసుధ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారో వేచిచూడాలి.