సినిమా వార్తలు

ప్రభాస్ ఫ్యాన్స్ కు అద్భుతమైన కానుక


11 months ago ప్రభాస్ ఫ్యాన్స్ కు అద్భుతమైన కానుక

ఈరోజు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులకు మరో కానుక లభించింది. 'షేడ్స్ ఆఫ్ సాహో' అంటూ 'సాహో' పేరిట ప్రభాస్ తాజా లుక్ ను విడుదల చేసిన టీమ్, అదే పేరుతో మరో వీడియోనూ విడుదల చేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, హిందీలో నిర్మితమవుతున్న చిత్రంలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని ఈ వీడియోలో తెలుస్తోంది. హాలీవుడ్ నిపుణులను రంగంలోకి దించిమరీ షూట్ చేసిన ఫైట్ సీన్ కు సంబంధించిన కొన్ని దృశ్యాలను, మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

అబుదాబిలో జరిగిన చిత్ర షూటింగ్, కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ వీడియోకు థమన్ సంగీతం అందించాడు. 'సాహో' కు మాత్రం శంకర్ ఈశన్ లాయ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. నిమిషాల వ్యవధిలో లక్షల వ్యూస్ సాధించిన ఈ వీడియో వైరల్ గా మారింది