సినిమా వార్తలు

జాన్వీకపూర్ కు అరుదైన గౌరవం!


9 months ago జాన్వీకపూర్ కు అరుదైన గౌరవం!

దివంగ‌త న‌టి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కు అరుదైన గౌరవం ద‌క్కింది. ‘రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’కు ఆమె ఎంపికైంది. ముంబైలోని నార్వేజియన్ కాన్సులేట్ జనరల్ ఈ అవార్డును ఆమెకు  ప్రదానం చేయనుంది. ఈ అవార్డుకు ఎంపికైన జాన్వీ తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది. ఈ అవార్డు తనకు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని తెలిపారు. ఈ ఏడాది 'ధడక్' చిత్రం ద్వారా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టానన్నారు. నార్వేలోని ప్రేక్ష‌కుల‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను చూశారని పేర్కొంది. ఈ సినిమాను వీక్షించిన నార్వే ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించార‌ని ఆమె తెలిపారు.