సినిమా వార్తలు

అరవింద సమేత సరికొత్త రికార్డు


11 months ago అరవింద సమేత సరికొత్త రికార్డు

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' ఈ నెల 11వ తేదీన విడుదలైన విషయం విదితమే. ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా, తొలి రోజునే మంచి టాక్ తెచ్చుకుంది. దసరా రోజుల్లో విడుదలలైన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 11 రోజుల్లో 69 కోట్ల షేర్ ను వసూలు చేసిందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 91 కోట్ల షేర్ మార్క్ ను దాటిందని తెలుస్తోంది. ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఎన్టీఆర్ కెరియర్లో ఇదే ఫస్టు టైమ్ అని ఫిలింనగర్ వర్గాల టాక్.

ఓవర్సీస్ వసూళ్ల విషయంలోను ఈ సినిమా రికార్డును సృష్టించింది. త్రివిక్రమ్ ఇమేజ్ .. ఎన్టీఆర్ క్రేజ్ .. కథాకథనాలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయంటున్నారు. పూజా హెగ్డే గ్లామర్ .. తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని నమోదు చేయడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.