సినిమా వార్తలు

రాజమౌళి ముల్టీస్టార్ర్ ఓపెనింగ్ కి మరో పెద్ద స్టార్?


10 months ago రాజమౌళి ముల్టీస్టార్ర్ ఓపెనింగ్ కి మరో పెద్ద స్టార్?

రాజమౌళి RRR ను ఈ నెల పదకొండవ తేదీన ఉదయం పదకొండు గంటలకు లాంచ్ చేయనున్నారు . ఈ వార్త శుక్రవారం సోషల్ మీడియా లో ప్రకటించారు. అప్పటినుంచి అభిమానుల్లో మరింత ఉత్సాహం ఉరకలేస్తోంది. తమ అభిమాన హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ లను ఒకే వేదికపై చూడటం  మామూలు విషయం కాదు. ఆరోజు ఒక జన సునామి ని ఊహించవచ్చు. ఇది చాలదన్నట్లు, ఆ రోజు ప్రత్యేక అతిధి గా ఎవరు రాబోతున్నారు అనే విషయమై ఊహాగానాలు మొదలయ్యాయి. 

ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, ఈ ముగ్గురికి ఆప్తుడైన ఒక వ్యక్తికి ఆ ఆహ్వానం అందినట్లు వార్తలొస్తున్నాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు, తన అందం, అభినయం, మంచితనం తో సినీ వర్గాలలో అందరికి ఆప్తుడుగా నిలిచిన డార్లింగ్ ప్రభాస్. మన బాహుబలితో పాటుగా , రానా , అనుష్కలు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందట. ఈ వార్త నిజం అయితే, నవంబర్ పదకొండు సినీ అభిమానులకు పండుగ రోజే అనటం లో ఏమాత్రం సందేహం లేదు. 

ప్రస్తుతం ప్రభాస్ యూరోప్ లో షూటింగ్ లో ఉన్నారు. ఆ సమయానికి ఇండియా కి తిరిగి వచ్చేస్తాడట. ఇంతమంది సినీ దిగ్గజాలు మెరవబోయే ఆ వేదికను చూడాలంటే కాస్త వేచిచూడాలి మరి.