సినిమా వార్తలు

500 మందితో 'వినయ విధేయ రామ' ఫైట్


9 months ago 500 మందితో 'వినయ విధేయ రామ' ఫైట్

చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో  'వినయ విధేయ రామ' సినిమా రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుందని తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా కోసం ఒక భారీ యాక్షన్ ఎపిపోడ్ ను చిత్రీకరించినట్టు సమాచారం. విశ్రాంతికి ముందు ఈ ఫైట్ సీన్ రానున్నట్టుగా తెలుస్తోంది. కథా పరంగా చాలా కీలకమైన సందర్భంలో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ కావడంతో, ఈ యాక్షన్ ఎపిసోడ్ ను భారీ స్థాయిలో చిత్రీకరించారట. చరణ్ తో పాటు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా ఈ యాక్షన్ ఎపిసోడ్ ను బోయపాటి తనదైన శైలిలో చిత్రీకరించినట్టు భోగట్టా. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ సీన్ నిలవనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.