సినిమా వార్తలు

విశాల్ పై 50 మంది నిర్మాతల తిరుగుబాటు!


9 months ago విశాల్ పై 50 మంది నిర్మాతల తిరుగుబాటు!

తమిళనాడు నిర్మాతల మండలిలోని అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్న విశాల్ కు వ్యతిరేకంగా మరొక వర్గం ఆందోళన చేపట్టింది. నిర్మాతల సంఘం భవనానికి తాళం వేసి, సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో దానిని అప్పగించింది. రాబోయే శుక్రవారం తమిళనాడులో ఏకంగా 9 సినిమాలు విడుదల కానున్నాయి. ఇన్ని సినిమాలు ఒకే రోజు విడుదలైతే... చిన్న చిత్రాల పరిస్థితి ఏమిటని విశాల్ వ్యతిరేక వర్గం ఆందోళన నిర్వహిస్తోంది.

నిర్మాతల సంఘం కార్యాలయం ఎదుట 50 మంది నిర్మాతలు ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సమయంలో విశాల్ అక్కడ అందుబాటులో లేకపోవడంతో కౌన్సిల్ సెక్రటరీ కదిరేశన్ తో వారు వాగ్వాదానికి దిగారు. విశాల్ కు సన్నిహితులైన ఉదయ, ఆర్కే సురేష్ లు కూడా ఇప్పుడు వ్యతిరేక వర్గంలో చేరడం విశేషం.